చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న మాదిగలు

  • ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, ప్రభుత్వ పదవుల్లో మాదిగలకు పెద్దపీట వేస్తానన్న చంద్రబాబు 
  • మహానాడు వేదికగా హామీ ఇచ్చిన టీడీపీ చీఫ్
  • 9.30 గంటలకు ఆత్మీయ సమావేశం
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం 9.30 గంటలకు మాదిగల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నట్టు టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుతో పాటు, అధికారంలోకి వస్తే ప్రభుత్వ పదవుల్లో మాదిగలకు పెద్దపీట వేస్తానని, జిల్లాల ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం జీవో 25ను అమలు చేస్తామని మహానాడు వేదికగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కృతజ్ఞత తెలిపేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Chandrababu
TDP SC Cell
Intimate Meeting
Mangalagiri

More Telugu News